Site icon Swatantra Tv

హైడ్రా కూల్చివేతల వివరాలు విడుదల

జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేసి, 111.72 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.

దీనికి ఐపీఎస్ అధికారి రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు హైడ్రా కోసం పని చేయనున్నారు.

Exit mobile version