Site icon Swatantra Tv

సైబర్‌ క్రైమ్‌ సిటీ..! -వార్షిక నివేదికను వెల్లడించిన సీపీ ఆనంద్‌

హైదరాబాద్‌: 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించిన సీపీ.. ఈ ఏడాది మొత్తం 22,060 కేసులు నమోదయ్యాయన్నారు. 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు … భారీగా ఆర్థిక నేరాలు నమోదు అయ్యాయని తెలిపారు. వాహనాల దొంగతనాల కేసులు ఏడాది బాగా పెరిగాయన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం… వజ్రోత్సవాలు లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్‌ చాలా ప్రశాంతంగా జరిగాయన్నారు సీవీ ఆనంద్‌.

Exit mobile version