Site icon Swatantra Tv

నా తల నరికివేయండి: మమతా బెనర్జీ

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ లో రాజకీయం హీటెక్కింది. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)ని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా.. విపక్షాలపై విరుచుకుపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను ఇవ్వాలని చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఎక్కువ డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) ఇవ్వడం సాధ్యం కాదు. మా వద్ద డబ్బు లేదు. మేము అదనంగా 3 శాతం డీఏ ఇచ్చాము. మీరు సంతోషంగా లేకుంటే ‘మీరు నా తలను నరికివేయండి’, మీకు ఇంకా ఎంత కావాలి?’’ అని మండిపడింది. ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇవ్వడానికి రాష్ట్రంలో నిధులు లేవని.. ఇంకా ఎంత ఇస్తామని ప్రశ్నించారు.

అధికార కేంద్ర బీజేపీ పై మండిపడుతూ.. వంటగ్యాస్ ధర సంగతి ఏంటి? ఎన్నికల తర్వాత ఒక్కరోజులోనే ధర పెంచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.79 లక్షల కోట్ల డీఏ చెల్లించిందని.. 40 రోజుల వేతనంతో సెలవు ఇస్తున్నామని తెలిపింది. మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మమ్మల్ని పోల్చారు? అని ప్రశ్నించింది.తాము ఉచిత బియ్యం ఇస్తున్నామని.. ఇంతకుమించి మిమ్మల్ని సంతృప్తి పరచడానికి ఏం కావాలి? అంటూ నిప్పులు చెరిగారు.

Read Also: అమెరికాలో కూలిన విమానం.. భారత సంతతి మహిళ మృతి, కుమార్తె పరిస్థితి విషమం

Follow us on:   Youtube   Instagram

Exit mobile version