Site icon Swatantra Tv

గొర్రెల స్కామ్ లో నిందితుల కస్టడీ

     గొర్రెల పంపిణీ పధకం స్కామ్ పై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ స్కామ్ లో నిందితులు, దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్టు, ఆ సొమ్ము దళారుల ఖాతాలో జమ అయినట్టు వెల్లడైంది. ఏసీబీ అధికారులు నలుగురు నిందితులను తొలిరోజు ఆరుగంటల పాటు విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.

       గొర్రెల స్కామ్ లో నలుగురు నిందితుల మూడో రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో, ఏసీబీ అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. తొలి రోజు నిందితులను ఆరు గంటలపాటు విచారించి స్టేట్ మెంట్ రికార్ట్ చేశారు. ఇంకా, రెండు రోజులు విచారించనున్నరు. గొర్రెల స్కాం కేసులో మరికొందరి పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ లను అరెస్ట్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన రెండు కోట్ల పది లక్షల రూపాయల నగదును బినామీ పేర్లతో నిందితులు వివిధ ఖాతాలకు మళ్లించినట్టు గుర్తించారు.

         నలుగురు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫిబ్రవరి 22న హాజరుపరచగా మార్చి 7 వరకు రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు తరలించారు. గొర్రెల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని యాదవ, కురుమ సంఘాలకు ప్రభుత్వం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారు. విడతల వారీగా సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ పథకంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఏసీబీ రంగ ప్రవేశం చేసి, పథకంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, కాంట్రాక్టర్లను విచారిస్తోంది.

         ఏపీకి చెందిన పల్నాడు జిల్లా రైతులకు చేరాల్సిన డబ్బును 10 అకౌంట్లకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయినట్టు ఏసీబీ గుర్తిం చింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఏసీబీ సేకరించింది. ఈ నేపథ్యంలో కొందరు బినామీలు పేర్లు బయటకు వచ్చాయి. నవాజ్‌‌‌‌‌‌‌‌, హిమజ మల్ల, కండ్రకోట కోటేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసులు, లింగ కోటేశ్వర రావు, లింగ రవితేజ, శెట్టి, మహ్మద్ అలీ, ఎల్ల పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌, పోలయ్య లకు చెందిన అకౌంట్లకు సొమ్ములు మళ్లించినట్లు ఏసీబీ అధికా రులు గుర్తించారు. సంబంధిత బ్యాంకు అకౌంట్లు, పలు ఖాతాలు ఫ్రీజ్ చేయించిన ఏసీబీ అధికారులు, ఖాతాదారు లకు నోటీస్ లు జారీ చేసి విచారణ సాగించారు. ఖాతాదారుల ఇచ్చిన సమాచారంతో సంబంధం ఉన్న మరికొంత మంది ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. బినామీ ఖాతాల్లో జమ అయిన మొత్తం డ్రా చేశారా, లేక ఇతర ఖాతాలకు ఎలా బదిలీ చేశారు అనే విషయాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాన నింది తులు మోహిదుద్దీన్, ఇక్రముద్దీన్ పరారీలో ఉన్నారు. వీళ్లిద్దరూ విదేశాల్లో తలదాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధిత రైతుల స్టేట్ మెంట్ ను సైతం ఏసీబీ రికార్డ్ చేసింది. రికార్డులు పరిశీ లించి బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. కాగ్ నివేదిక సైతం ఈ పథకంలోని పలు అంశాలను ప్రస్తావిం చింది. ఈ వివరాలనూ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Exit mobile version