Site icon Swatantra Tv

నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి: ఎంపీ లక్ష్మణ్‌

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కరువు, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సానుభూతి కోసం తనపై కుట్ర లు జరుగురున్నాయని.. రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు. మజ్లిస్‌ను గెలిపించ మని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అబధ్రతా భావంలో ఉందని విమర్శించారు. మజ్లీస్‌కు సపోర్ట్ చెయ్యడం హనుమంతరావు లాంటి వ్యక్తులకు ఇష్టం లేదన్నారు. సొంత నేతల వలనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version