35.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

చాదర్‌ఘాట్‌ హత్య కేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్‌లో కొద్దిరోజుల క్రితం మొండెం లేని తల దొరకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా తలకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ తల కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఎర్రం అనురాధగా గుర్తించారు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న చంద్రమౌళి అనే వ్యక్తే ఈ హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.

చంద్రమౌళి ఇంట్లోనే అనురాధ అద్దెకు ఉంటోందని.. ఆమె కొన్నాళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుందని మలక్ పేట డీసీపీ తెలిపారు. దీంతో వీరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడిందని.. ఈ క్రమంలోనే ఆమె దగ్గర రూ.6లక్షలు అప్పుగా తీసుకున్నాడని పేర్కొన్నారు. అయితే ఆ డబ్బును స్టాక్ మార్కెటులో ఇన్వెస్ట్ చేసి నష్టం రావడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నాడన్నారు. ప్లాన్ ప్రకారం అనురాధను చంపేసి ఆమె తలను ఓ ఆటోలో తీసుకువెళ్లి మూసీ నదిలో పడివేశాడని చెప్పారు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రీజ్‌లో దాచాడని డీసీపీ వెల్లడించారు.

Latest Articles

‘ఫ్యామిలీ స్టార్’ను కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు: డైరెక్టర్ పరశురామ్

సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్