Site icon Swatantra Tv

రుణమాఫీ చేసిన.. చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదే- రేవంత్

అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి…ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా…నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా…ఎంత కష్టమైనా, ఎంత భారమైనా.. ఏకకాలంలో రుణమాఫీ చేసిన… చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి…పంద్రాగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా…మలి అడుగు విధివిధానాల ఖరారు చేయడమేనని అన్నారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో…రైతు సంక్షేమ కోణం ఉంటుందని చెప్పారు. ఇది రైతన్నకు… రేవంతన్న ఇస్తున్న మాట అంటూ ఎక్స్‌ వేదికగా ఆయన అన్నారు.

Exit mobile version