Site icon Swatantra Tv

కంట్రీక్లబ్‌.. వెల్‌కమ్‌ వేడుకలు షురూ..

కంట్రీ క్లబ్‌ అందరికన్నా ముందుగా న్యూ ఇయర్‌ బాష్‌కి వెల్‌ కమ్‌ చెప్పింది. కంట్రీక్లబ్‌ హాస్పిటాలిటీ అండ్‌ హాలిడేస్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆసియాలోనే అత్యంత భారీ స్థాయి నూతన సంవత్సర వేడుకలను ’వార్‌ ఆఫ్‌ డీజేస్‌’ను నిర్వహిస్తున్నట్టు కంట్రీక్లబ్‌ ఎండి రాజీవ్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బేగంపేట్‌లోని క్లబ్‌ ఆవరణలో సోమవారం నాడు కంట్రీ క్లబ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ రెడ్డి, నటి దక్షా నాగర్కర్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుక వివరాలను వెల్లడిస్తూ, చలో శ్రీలంక బడే దిల్‌వాలే కార్డ్‌ ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దక్షా డాన్స్ బృందంతో తన నృత్యాలతో కాసేపు అలరించారు.

ఈ సంవత్సరం కూడా దేశంలోని తమ అన్ని క్లబ్‌లు రిసార్ట్‌లలో ‘‘ఆసియాలోనే అతిపెద్ద న్యూ ఇయర్‌ బాష్‌ 2025’’ని ఏర్పాటు చేస్తున్నామన్నారు, సిటీకి సంబంధించి తమ ప్రధాన వేడుక, ‘‘వార్‌ ఆఫ్‌ ది డిజేస్‌’ నగరంలోని పోలీస్‌ హాకీ స్టేడియంలో జరుగనుందని, దీనిలో ప్రముఖ తారల ప్రదర్శనలు, డిజె సెట్స్‌తో పాటు టాలీవుడ్‌ నటి దక్షా నాగర్కర్‌ నృత్యాలు ప్రధాన ఆకర్షణ అని రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇటీవలి తన శ్రీలంక పర్యటనలను రాజీవ్ రెడ్డి గుర్తు చేసుకుంటూ.. ‘‘చలో శ్రీలంక బడే దిల్‌వాలే కార్డ్‌ ’ శ్రీలంకలో తన స్వంత పర్యటన నుంచి ప్రేరణ పొంది రూపొందింది’’ అని చెప్పారు. కొలంబోలో అద్భుతమైన నైట్‌ లైఫ్, క్యాండీ స్‌ ఐకానిక్‌ టెంపుల్‌ ఆఫ్‌ ద టూత్‌ రెలిక్,తుల్‌గాలాలో వైట్‌–వాటర్‌ రాఫ్టింగ్‌ వరకు ఎన్నో మధుర జ్ఞాపకాల ఈ యాత్ర ద్వారా పోగు చేసుకోవచ్చునన్నారు. ప్రపంచ స్థాయి అనుభవాలను మా సభ్యులకు అందించాలనుకుంటున్నామని, ఈ కార్యక్రమం ద్వారా తమ సభ్యులు తమ స్వంత అద్భుతమైన జ్ఞాపకాలను పొందగలరని తన నమ్మకం అన్నారు. ‘చలో శ్రీలంక‘తో కంట్రీ క్లబ్‌ ఇండియా ప్రపంచ పర్యాటక రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పుతోందని, సభ్యులకు ప్రత్యేకమైన ప్రయాణ ప్రయోజనాలను మాత్రమే కాకుండా అర్థవంతమైన సాంస్కృతిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోందని తెలిపారు.

Exit mobile version