Site icon Swatantra Tv

తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపిస్తా- కేసీఆర్

కాంగ్రెస్ సర్కారుపై మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నా… గంభీరంగా చూస్తున్నానని… నేను కానీ కొడితే మామూలుగా ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతానని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలేవరు సంతోషంగా లేరని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని అన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారని చెప్పారు. తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయని ధ్వజమెత్తారు.

Exit mobile version