Site icon Swatantra Tv

కరెంటు, నీళ్ళు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – నిరంజన్ రెడ్డి

     కాంగ్రెస్‌ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం లీకులు ఇస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై అధికారికంగా ఇప్పటి వరకు సీఎం, మంత్రులు స్పందించలేదన్నారు. వెబ్ సిరీస్ లాగా ఫోన్ ట్యాపింగ్‌ను సాగదీస్తు న్నారన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలకు లీగల్ సెన్స్‌ లేదన్నారు నిరంజన్‌ రెడ్డి. రాష్ట్రంలో కరెంటు, నీళ్ళు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వరికి బోనస్ మీద తల తోక లేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన వరికి బోనస్ బోగస్ మాత్రమేనని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే రైతుల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్లపై ప్రశ్నించిన రైతులపై దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎరువుల కొరత వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్పుడు ఏనాడు ఎరువుల కొరత రాలేదన్నారు. బీఆర్ఎస్‌ను బద్నాం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర లు చేస్తోందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే శ్రద్ధ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం లోపించిందన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిలైందన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రాంగ్‌ డైరెక్షన్‌లో వెళ్తుందన్నారు నిరంజన్‌ రెడ్డి.

Exit mobile version