Site icon Swatantra Tv

కాంగ్రెస్ లోక్‌సభ పెండింగ్ స్థానాలపై కసరత్తు పూర్తి

   లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. పెండింగ్ అభ్యర్థుల స్థానాలపై కూడా అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాలపై తర్జనభర్జన పడుతోంది. మొత్తానికి మూడు స్థానాలపై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. నామినేషన్ కంటే ముందే అభ్యర్థు లను ప్రకటించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాదరెడ్డి, మండవ వెంకటేశ్వరావు, మల్లు నందిని పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే కరీంనగర్‌కు వెలిశాల రాజేందర్ రావు పేరును దాదాపు ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన హైదరాబాద్‌ స్థానానికి మహమ్మద్ సమీరుల్లా ఖాన్‌ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version