Site icon Swatantra Tv

టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఏం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ప్రజాభవన్ లో జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఏం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. చెప్పిన దాని కంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలిపారు. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని చెప్పారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించామన్నారు. రైతులకు రుణమాఫీ చేయడం తన జీవితంలో మర్చిపోలేనిదని అని అన్నారు. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో‌ ముడిపడి ఉందన్నారు.

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చేప్పడానికే 2 లక్షల రుణ మాఫీ చేస్తున్నామన్నారు. రుణమాఫీపై గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ప్రచారం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్ళాం. ఇపుడు రుణ మాఫీ చేశామని గ్రామాల్లో చెప్పండి అంటూ దిశానిర్దేశం చేశారు. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బు పడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపల మరో లక్ష వేస్తామని ప్రకటించారు. భారత దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు.

Exit mobile version