Site icon Swatantra Tv

నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

     ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ బ్రహ్మోత్స వాల్లో పాల్గొననున్నారు.

    నారాయణపేట జిల్లా మద్దూర్‌ గ్రీన్‌ ప్యాలెస్‌లో నిర్వహించనున్న పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరిగే గిరిజనుల ఆరాధ్యదైవం బావోజీ బ్రహ్మోత్సల్లో పాల్గొని, స్వామిని దర్శించుకోను న్నారు. సాయంత్రం 5 గంటలకు బిజినేపల్లిలో బహిరంగసభ సీఎం రేవంత్‌ పాల్గొంటారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నాగర్‌కర్నూల్‌ జిల్లాకు వస్తున్న రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్లమెంట్‌ నియోకజవర్గంలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సమాయ త్తమయ్యారు. మల్లురవి నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ పాల్గొనను న్నారు. బిజినేపల్లి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అందుకోసం బిజినేపల్లి నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు పక్కన 12 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎస్పీతోపాటు దాదాపు వెయ్యి మంది పోలీస్‌ ఉన్నతాధికా రులు సీఎం భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ సంద్భంగా సీఎం రేవంత్ పాలమూరు జిల్లాలో పర్యటించారు. తాజాగా మరోసారి పర్యటిస్తున్నారు.

Exit mobile version