Site icon Swatantra Tv

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌ బిజీ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ అయ్యారు. ఇవాళ రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించాలన్న నిర్ణయం మేరకు.. సభకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. అలాగే ఈ సభకు రాహుల్ సహా పలువురు అగ్రనేతలను సీఎం రేవంత్‌ ఆహ్వానించనున్నారు. అలాగే ఇవాళ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలవనున్నారు సీఎం రేవంత్‌. కాళేశ్వరం ప్రాజెక్టు సహా తెలంగాణలోని ఇతర ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై పాటిల్‌తో చర్చించనున్నారు.

నిన్న ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దర్శనం అనంతరం హస్తినకు వెళ్లిన ఆయన.. మేడిగ‌డ్డ బ్యారేజీ మ‌ర‌మ్మతులు, ప‌రీక్షలు, క‌మిష‌న్ విచార‌ణ త‌దిత‌ర‌ అంశాల‌పై స‌మీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని త‌న‌ అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ కార్యద‌ర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌తో స‌మావేశమ‌య్యారు. ఈ సందర్భంగా.. ఢిల్లీలో శ‌నివారంనాడు జ‌రిగిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స‌మావేశంలో చ‌ర్చకు వ‌చ్చిన‌ అంశాల‌ను ఉత్తమ్‌, అధికారులు.. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాల‌పై ముఖ్యమంత్రి త‌న అభిప్రాయాల‌ను వారికి తెలియ‌జేశారు. సోమ‌వారం ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న ఎన్‌డీఎస్ఏ స‌మావేశంలో అధికారులు, ఇంజినీర్లు స‌మావేశంపై రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు, సలహాలు చేశారు.

Exit mobile version