Site icon Swatantra Tv

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన

   వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సమయం దగ్గర పడడంతో సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని 3 నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నారు. కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రారంభం కానుంది. వైఎస్సార్‌ సర్కిల్‌లో ఎస్వీ కాంప్లెక్స్‌ రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. కర్నూలు సభ అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్‌ రోడ్‌లో జరిగే సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని కోడూరు రోడ్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు.

Exit mobile version