Site icon Swatantra Tv

నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

    బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. వైసీపీ ఎన్నికల శంఖారావ సభలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం ఆఖరి సభకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరుగుతుంది. గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే.. రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్‌ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

        అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద వందలాది ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లుచేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో రానున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్‌ ఇప్పటికే భీమిలి, దెందులూ రు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు నాలుగో సభ నిర్వహిస్తు న్నారు. సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా మొత్తం సుమారు 4 వేల 200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version