సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు మాత్రం బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారన్నారు. మాడుగుల నియోజకవర్గ MPTCలు,ZPTCలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, కానీ చివరకు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా దిగజారిపోయిందని చెప్పారు. ప్రస్తుతం రెడ్ బుక్ పాలన నడుస్తోందన్నారు. కక్షలు తీర్చుకునేవారిని పోత్సహించేలా చంద్రబాబు తీరు ఉందని జగన్ మండిపడ్డారు.
తాను ఉండి ఉంటే.. రైతు భరోసా అందేదన్నారు. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లులకు అమ్మ ఒడి అందేదన్నారు. సున్నా వడ్డీ కూడా వచ్చి ఉండేదన్నారు. విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్‌మెంట్, వసతి దీవెన వచ్చేదన్నారు. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేదన్నారు.