Site icon Swatantra Tv

దహన సంస్కారాల్లో అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. మా భూమిలో వద్దంటే.. మా భూమిలో వద్దు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా మంగలగూడెంలో దారుణం చోటుచేసుకుంది. దహన సంస్కారాల విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెట్టిది. ఏర్పాట్లు చేస్తుండగా మా భూమిలో పెట్టొదంటే మా భూమిలో పెట్టొద్దని వాధించుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తిట్టుకోవడంతో పాటు.. కొట్టుకోవడం వరకు వచ్చింది. గొడ్డళ్లు, కర్రలతో పరస్పర దాడులు చేసుకోవడంతో దహనసంస్కారాలు ఆగిపోయాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version