Site icon Swatantra Tv

ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు

దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు ఏపీ బృందం హాజరుకానుంది. మేరకు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నాలుగు రోజులపాటు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్పుకు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, అధికారులు హాజరుకానున్నారు. ఇవాళ రాత్రికి చంద్రబాబు బయలుదేరనున్నారు. ఇవాళ రాత్రికి సీఎం చంద్రబాబు దావోస్‌కు వెళ్లనున్నారు.

రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దావోస్‌లో వివరించనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుద్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో ఏపీలో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు వివరించనున్నారు.

Exit mobile version