Site icon Swatantra Tv

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు చెప్పారు – వై.ఎస్‌ జగన్‌

అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు వైసీపీ అధినేత వై.ఎస్‌ జగన్‌. రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేశారని ఫైరయ్యారు. 2018-19 నాటికి ఏపీ అప్పు 3 లక్షలా 13 వేల కోట్లు ఉండగా.. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారన్నారు. చివరకు కాగ్‌ రిపోర్ట్‌పైనా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అయినా సరే వాస్తవాలు ఏమిటో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పత్రాలు స్పష్టంగా చెబుతున్నాయని ఎద్దేవా చేశారు వై.ఎస్ జగన్‌.

FRBM పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారన్నారు వై.ఎస్ జగన్. ఎవరు విధ్వంసకారులన్నది అంకెలు చూస్తే అర్థమవుతుందన్నారు. బడ్జెట్‌లో ఒకటి పెట్టి బయట మరోటి చెబుతున్నారని విమర్శించారు. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదంటూ ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. అందరూ కలిసి అబద్దాలకు రెక్కలు కడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు జగన్.

Exit mobile version