Site icon Swatantra Tv

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలపై ఈసీకి చంద్రబాబు లేఖ

Chandrababu

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు(Chandrababu) లేఖ రాశారు. కౌంటింగ్ సెంటర్స్ లో భద్రత పెంచడం తో పాటు…నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్ లో వైసీపీ రౌడీల చొరబాటు ఘటనను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.

Chandrababu లేఖలో పేర్కొన్న అంశాలు:

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికార వైసీపీ అక్రమాలు, ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

వైసీపీ మూకలు అక్రమ పద్దతుల ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తునారు.

అనంతపురంలో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు ప్రయత్నించారు.

నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వైసీపీ గూండాలు ఎలాంటి పాసులు లేకుండా అక్రమంగా కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లి అలజడి సృష్టించారు.

టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లపై దాడి చేసి కౌంటింగ్ స్టేషన్‌లో గందరగోళం సృష్టించారు.

పోలీసులు రౌడీలను అరెస్టు చేయకుండా టీడీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని అరెస్టు చేశారు.

ఓటమిని నుంచి బయటపడడానికి వైసీపీ నేతలు కౌంటింగ్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇలాంటి అక్రమాలు వైఎస్‌ఆర్‌సీపీ గూండాలకు అలవాటుగా మారాయి.

అధికార వైఎస్సార్‌సీపీ ఒత్తిడి కారణంగా ఎన్నికల సిబ్బంది చట్ట ప్రకారం విధులు నిర్వర్తించలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో మూడు పట్టభద్రుల నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల్లో తక్షణమే భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నా

ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చూడాలి

టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేసి….కౌంటింగ్ హాల్ లో రభస సృష్టించిన దోషులను అరెస్టు చేయాలి.

ఈ మేరకు మీరు పోలీసులను, స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతున్నా

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమం గా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి

ఎటువంటి పాసులు, గుర్తింపు కార్డులు లేకుండా కౌంటింగ్ స్టేషన్‌లో చొరబడిన YSRCP అనుచరుల వీడియోను లేఖకు జత చేసిన టీడీపీ అధినేత

Read Also: నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ
Follow us on:   Youtube   Instagram
Exit mobile version