Site icon Swatantra Tv

ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించిన చంద్రబాబు

    ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారు. ఇవాళ ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఉపముఖ్య మంత్రిని చేయడంతోపాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యా టకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్‌ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలిసింది. లోకేశ్‌కు కూడా కీలక శాఖను కేటాయించను న్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version