Site icon Swatantra Tv

చంద్రబాబు అరెస్ట్.. వేదికపై ఏడ్చిన నారా లోకేష్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నారా లోకేష్ కంటతడి పెట్టుకున్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసమే నిస్వార్థంగా పని చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. స్కిల్ కేసులో నిందితులు అందరూ బయటికి వచ్చారు. వ్యవస్థలను మేనేజ్ చేసి 43 రోజులుగా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బందించారు. తలచుకుంటేనే దు:ఖం తన్నుకొస్తొంది. చివరికి మా తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ నారా లోకేష్ భావోధ్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు లోకేష్. ప్రస్తుతం లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ కాస్త బాధకు గురి చేస్తోంది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ ప్రసంగం చేశారు. ప్రజల కోసం పోరాడిన నాయకుడు చంద్రబాబు అంటూ సమావేశ వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రాన్ని సీఎం జగన్ ముక్కలు చేసి అమ్మేసేవాడని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని స్పష్టం చేశారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బే సంపాదించాలని చంద్రబాబు భావిస్తే.. రాజకీయాలు అవసరం లేదని పేర్కొన్నారు. 2019లో జగన్ ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు గెలిపించారు. నియంత మాదిరిగా మారి రాష్ట్రాన్ని నాశనం చేశారని తెలిపారు.

Exit mobile version