Site icon Swatantra Tv

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, చంద్రబాబులిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించారు. మైసూరువారిపల్లె గ్రామ సభలో పాల్గొన్న పవన్‌కల్యాణ్‌ తన వ్యాఖ్యలతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికెత్తారు. సీఎం చంద్రబాబు అనుభవం ఆంధ్రప్రదేశ్‌కు అవసరమని చాలా సభల్లో చెప్పా… అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే. లక్షలమందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వగలిగారు. నాకంటే బాగా ఆలోచించ గలిగేవాళ్ల వెంట నడిచేందుకు నేనేమీ సంకోచించను. పాలనానుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది అంటూ ప్రశంసించారు.

ఇటు చంద్రబాబు కూడా పవన్‌కల్యాణ్‌ఫై అదే తీరులో ప్రశంసల జల్లు కురిపించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో గ్రామసభలో పాల్గొన్న ముఖ్యంమంత్రి.. వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. జగన్‌ కన్నా పవన్‌ ఎంతో గొప్పవాడని వ్యాఖ్యానించారు. ఇలా ఏపీ గ్రామసభల్లో ఒకరిపట్ల ఒకరు గొప్పగా చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Exit mobile version