ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనపై వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని అన్నారు. పోలవరం విషయం లో దుర్మార్గంగా అవాస్త వాలు ప్రచారం చేస్తున్నారని, జగన్ కారణంగానే పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలోకి నెట్టివేయబడిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్లే పోలవరంకు ఇవాళ ఈ దుస్థితి తలెత్తిందని అంబటి విమర్శించారు. రెండు కాపర్ డ్యాంలు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయా ఫ్రం వాల్ నిర్మించాలని, అలా జరగలే దని అంబటి చెప్పారు. నది డైవర్షన్ చెయ్యకుండా డయా ఫ్రం వాల్ కట్టడం వల్ల వరదలకు కొట్టుకుపోయిం దని అన్నారు. ఇరిగేషన్ పై అవగాహన ఉన్న మేధవులంతా చంద్రబాబు చేసిన తప్పుని గ్రహించారని అంబటి ఆరోపించారు.