అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం ప్రకటించింది. 15 వేల కోట్లు ఏపీకి కేంద్రం కేటాయించింది. ఏపీ విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపింది. వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైతే నిధులు కేటాయిస్తామని తెలిపారు.