ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బిహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్-యునైటెడ్ డిమాండ్ చేసింది. దీనిపై కేంద్రం స్పందించింది. ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బిహార్‌తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా..? అని జేడీయూ ఎంపీ రామ్‌ప్రిత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.