మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ యూకే పర్యటనకు షరతులతో అనుమతిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు యూకేలోని తమ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జగన్‌కు అనుమతించింది. ఆయన చేసుకున్న దరఖాస్తుపై ఐదేళ్ల కాలపరిమితితో పాస్‌పోర్టు జారీ చేయాలని పాస్‌పోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లేముందు పర్యటన వివరాలను కోర్టుకు, సీబీఐకి అందజేయాలని షరతు విధించింది. మొబైల్, ల్యాండ్‌లైన్, ఫ్యాక్స్, ఈ మెయిల్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు.