Site icon Swatantra Tv

కార్ల ర్యాలీ.. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. టీడీపీ అధినేతకు మద్దతుగా వారు నేడు ఉదయం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్లలో ర్యాలీగా బయలుదేరారు. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో చేపట్టిన ఈ ర్యాలీలో నగరంలోని గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు పాల్గొంటున్నారు. రాజమహేంద్రవరానికి చేరుకున్నాక వారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలుపుతారు.

అయితే, ఐటీ ఉద్యోగుల ర్యాలీకి ఏపీలో అనుమతి లేదని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. ఈ మేరకు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు..తెలంగాణ-ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వెళ్లే కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Exit mobile version