Site icon Swatantra Tv

తెలంగాణలో ఈ నెల 11 న కాంగ్రెస్ అగ్ర నేతల ప్రచారం

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ లోక్ సభ నియోజకవర్గాల్లో విజయభేరి మోగించాలనే ఉత్సాహంతో ముందుకు సాగ నుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తరచూ బహిరంగ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మిగిలి ఉండడంతో హస్తం పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది.

లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రానికి క్యూ కట్టారు. ఈనెల 11తో ప్రచార పర్వం ముగియనుంది. కేవలం మూడు రోజులే మిగిలి ఉండటంతో పార్టీ సీనియర్ లీడర్లు తెలంగాణకు వస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు రాహుల్, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ మెదక్​లో ప్రచారం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ లో నిర్వహించే జన జాతర సభకు అటెండ్ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీనగర్​లోని సరూర్​నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జన జాతర సభకు రాహుల్ హాజరుకానున్నారు.

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జన జాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు వస్తారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నకిరేకల్​లో నిర్వహించనున్న జన జాతర సభకు హాజరవుతారు. ఇక శనివారం, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో నిర్వహించ నున్న సభలో ఆమె పాల్గొని మాట్లాడుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో నిర్వహించే సభకు హాజర వుతారు.

Exit mobile version