స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000నోట్లు ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ కీలక వివరణ ఇచ్చారు. కేంద్ర బ్యాంకులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నోట్ల రద్దు అంశంపై పలు విషయాలను వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్‌మెంట్ చర్యల్లో భాగమేనని స్పష్టంచేశారు. క్లీన్ నోట్ పాలసీ అనే ప్రక్రియ ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2వేల నోట్ల విలువ కేవలం 10.8శాతం మాత్రమే అన్నారు. అందుచేత దేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్ప ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రూ.1000 నోటును పున:ప్రవేశపెట్టే ఆలోచనే లేదని స్పష్టత ఇచ్చారు. కాగా 2016 నవంబర్ లో నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ రూ.2000 నోటు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.