29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

Gold Price |పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price |దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. గురువారం స్వల్పంగా బంగారం ధర తగ్గినా.. శుక్రవారం పసిడి ప్రియులకు షాక్ తగిలింది. తులం బంగారంపై ఏకంగా 600 రూపాయల వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,930 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,400 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,430 వద్ద నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 59,930గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,830 వద్ద కొనసాగుతోంది.

Gold Price |తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,780గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,780 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,780గా ఉంది.

వెండి ధర: బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం దేశంలో కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకు పెరిగింది. ఇవాళ చెన్నైలో కిలో వెండి ధర రూ.75,400, ముంబైలో రూ. 72,600, ఢిల్లీలో రూ. 72,600, కోల్‌కతాలో కిలో వెండి రూ. 72,600 బెంగళూరులో రూ.75,400, హైదరాబాద్‌లో రూ.75,400, విశాఖ, విజయవాడలో రూ.75,400గా ఉంది.

Read Also: పేపర్‌ లీకేజీ ఘటనపై తాజా నివేదిక ఇవ్వాలి: గవర్నర్‌ తమిళిసై

Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్