Site icon Swatantra Tv

RGV కి.. BRS కార్పొరేటర్ స్ట్రాంగ్ వార్నింగ్

RGV

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ(RGV) చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్(BRS) కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్‌ ముదిరాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. అంబర్ పేటలో కుక్కుల దాడి ఘటనలో బాలుడి మృతికి మేయర్ ఒక్కరే కారణమన్నట్లు తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళ అని కూడా చూడకుండా అర్థరాత్రి వరకు ట్వీట్స్ చేయడంపై మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై మంచి సూచనలు చేయాలే కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని గట్టి వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే మేయర్  విజయలక్ష్మికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also:
Exit mobile version