Bridegroom comes in Bullock cart | కోటీశ్వరులైనా సంప్రదాయాలు మర్చిపోలేదు. కోట్లున్నా పెద్దల అడుగుజాడలు ఆపలేదు. లగ్జరీగా ఉంటూనే పూర్వీకుల నాటి సంస్కృతినీ వీడలేదు. గుజరాత్(Gujarat)లోని సూరత్ లో బీజేపీ నేత భరత్ వషూశియా తన కుమారుడికి నేర్పిన పాఠాలు ఇవి. తమ ఇమేజ్ కు తగ్గట్లు కుమారుడి పెళ్లి ఊరేగింపులో 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. అయినా కానీ తాతల నాటి సంప్రదాయంలో భాగంగా ఎద్దుల బండి(Bullockcart)పై పెళ్లి కుమారుడు ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు. ఈ ఊరేగింపును చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సౌరాష్ట్రలో పెళ్లి ఊరేగింపు జరిగేటప్పుడు వరుడు ఎద్దుల బండిలో రావడం తమ సంప్రదాయమని భరత్ తెలిపారు. అలాగే తన కుమారుడికి లగ్జరీ కార్లంటే ఇష్టమని.. వాడి కోసం విలాసవంతమైన కార్లను ఊరేగింపులో వినియోగించామని ఆయన వెల్లడించారు.