Site icon Swatantra Tv

ఫార్ములా -ఈ రేసు ఒక లొట్టపీసు కేసు- కేటీఆర్‌

ఫార్ములా ఈ రేసు కేసుపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు. అసలు అవినీతే జరగనప్పుడు కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పని అన్నారు. ఈనెల 7న ఈడీ విచారణకు హాజరు కావాలా.. వద్దా అనేది తమ లాయర్లు నిర్ణయిస్తారని చెప్పారు.

తనపై నమోదు చేసిన ఏసీబీ కేసులో అసలు పస లేదని అన్నారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్న కేటీఆర్‌.. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసని ఆరోపించారు. పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్‌ చెప్పారు. తనను జైలుకు పంపించడానికి ఇది ఆరో ప్రయత్నమన్న కేటీఆర్‌.. సీఎం రేవంత్ కు ఏమీ దొరకటం లేదని చెప్పారు. రూ. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.

కోర్టులో జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని.. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్నా.. వద్దనేది రేవంత్ నిర్ణయమని చెప్పారు. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్ లో చర్చ జరగలేదన్నారు. నాపై కేసు పెడితే.‌. రేవంత్ పై కూడా కేసు పెట్టాలి అని కేటీఆర్‌ చెప్పారు.

Exit mobile version