Site icon Swatantra Tv

ఎన్నికలను బహిష్కరించండి.. తెలంగాణ ప్రజలకు మావోల పిలుపు

స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలలో బహిష్కరించాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది. బిజెపితో పాటు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, వారు ఇచ్చే మూటకపు వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని కోరింది. గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని సూచించింది.

ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ మేరకు నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం తో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే నిన్న ఎన్నికలపై ప్రకటన చేయడంతో… తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

Exit mobile version