టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ మంత్రి బొత్స సత్యనారా యణ ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్‌లు, యూనివర్శిటి వీసీలపై జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమన్నా రు. యూనివర్శిటీ వీసీలను ఎంపిక చేసేది గవర్నర్ అని గుర్తుచేశారు. ద్రవిడ యూనివర్శిటీలో తప్పులు జరిగితే అప్పటి వీసీపై చర్యలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ పోస్టులు మొత్తం 6 వేల పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని అంచనా వేశామని, ప్రస్తుత ప్రభుత్వం 16 వేల పోస్టుల ఎలా భర్తీ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
టీడీపీ ప్రభుత్వ పాలనపై బొత్స కామెంట్స్
