Site icon Swatantra Tv

మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది – కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం సరికాదని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పేదలను ఒప్పించి మాత్రమే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్ఠం చేశారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, నిర్వాసితులకు అండగా రేపట్నుంచే కొత్త కార్యచరణ అమలు చేయబోతున్నామన్నారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా కిషన్‌రెడ్డి సమీక్షించారు. ఇప్పటివరకు జిల్లాల్లో జరిగిన సభ్యత్వ నమోదు వివరాలపై ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై నేతలతో కిషన్‌రెడ్డి చర్చించారు.

Exit mobile version