Site icon Swatantra Tv

సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల

సార్వత్రిక ఎన్నికలకు సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ దీన్ని ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్‌ థీమ్‌తో మొత్తం 14 అంశాలతో రూపొందించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చారు. అందులో విశ్వబంధు, సురక్షిత భారత్‌, సమృద్ధ భారత్‌, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వచ్ఛ భారత్‌, అత్యుత్తమ శిక్షణ, క్రీడావికాసం, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్‌ ఉన్నాయి.

గత పదేళ్లలో దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షలను ప్రతిబింభిస్తోందని చెప్పారు. పేదలకు మరో మూడు కోట్ల ఉచి ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న మోదీ…యువత, మహిళ, పేద, రైతు వర్గాలపై ఫోకస్ చేశామన్నారు.

Exit mobile version