Site icon Swatantra Tv

ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ ఫోకస్

దక్షిణాది రాష్ట్రాల మీద ద్రుష్టి పెట్టిన బీజేపీ.. ఇందుకోసం ప్రత్యేకం గా సహ సంఘటన మంత్రిని నియమించుకొంది. బీజేపీ లో ప్రధానంగా సంఘటన మంత్రి ఆధారంగానే పార్టీ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఇంకా చెప్పాలంటే పార్టీలో కీలక నిర్ణయాలకు కచ్చితంగా సంఘటన మంత్రి ఆమోదం ఉండాల్సిందే. ఇదే బాటలో శివ ప్రకాష్ ను సహ సంఘటన మంత్రిగా నియమించారు. శివ ప్రకాష్ రాకతో దక్షిణాదిన పార్టీ కార్యకలాపాలు ఒక గాటిన పడుతున్నాయి. కర్నాటక, తెలంగాణ ల్లో పార్టీ బలంగానే ఉంది కాబట్టి మిగిలిన చోట్ల ఫోకస్ పెంచుతున్నారు.

ఇందుకు తగినట్లుగానే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద, ముఖ్యంగా రాయలసీమ వ్యవహారాల పై శివ ప్రకాష్ తరుచుగా సమీక్షలు జరిపారు. బీజేపీ లో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, కూడా ఎంపీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఇందుకు తగినట్లుగానే కడప, కర్నూలు, వంటి చోట్ల ఈ నాయకుల్ని నిలిపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాయల సీమ లో ఇతర నియోజక వర్గాల విషయంలో కూడా ఏపీ బీజేపీ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
పార్టీ జెండాను బలంగా మోస్తున్న రాజంపేట పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీలో చేరినప్పటి నుంచీ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ పనిచేయటం… సాయిలోకేష్ కు కలిసి వచ్చింది. శబరిమలై రైలుకి స్టాప్ ఏర్పాటు చేయించటం, ప్రాజెక్టుల మీద ఆందోళనలు చేయటంతో ప్రజల్లో పాపులారిటీ పెరిగింది. దీంతో ఆయనకు రాజంపేట పార్లమెంటు స్థానం బాధ్యతల్ని అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు తిరుపతి చిత్తూరు విషయంలో కూడా ప్రజా పోరాటాలకే పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ విషయాలు, ధార్మిక అంశాల మీద పోరాడుతున్ననాయకులకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version