Site icon Swatantra Tv

ఆటో కార్మికులను మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు- వేముల మారయ్య

ఆటో కార్మికులను బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేశాయని బీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆటో కార్మికుల సమావేశం ఆయన మాట్లాడారు. ఉచిత బస్సు పథకంతో ఆటోకార్మికులకు ఉరితాడు వేసిన కాంగ్రెస్ ప్రార్టీని పార్లమెంట్ ఎన్నికలలో చిత్తుగా ఓడిస్తామని మారయ్య హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా సీఎం రేవంత్ ఆటో డ్రైవర్లతో మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించి, కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు.

Exit mobile version