Site icon Swatantra Tv

బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ – మంత్రి పొన్నం

బీజేపీ, బీఆర్ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీకి ఏటీఎంలా బీఆర్‌ఎస్‌ పనిచేసిందన్నారు. మిగులు బడ్జెట్‌తో తెలంగాణను అప్పగిస్తే అప్పుల కుప్పగా బీఆర్‌ఎస్‌ చేసిందని పొన్నం విమర్శించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అవరోధాలు దాటి అభివృద్ధిలో సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మంత్రి పొన్నం రామగుండంలో కాంగ్రెస్ శ్రేణులను కలుసుకున్నారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో అల్పాహారం చేశారు పొననం. ఈనెల 19న వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవంలో ఇందిర మహిళా చైతన్య సదస్సు సక్సెస్‌ చేయాలని ఆయన కోరారు.

Exit mobile version