Site icon Swatantra Tv

మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాకు భారీ ఊరట

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్‌ శిల్పాశెట్టి , ఆమె భర్త రాజ్ కుంద్రాకు భారీ ఊరట లభించింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలంటూ ఈడీ పంపిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. రాజ్‌కుంద్రా సంస్థ 2017లో బిట్‌కాయిన్ల రూపంలో సుమారు 6వేల 600 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే నెల‌కు ప‌ది శాతం రిట‌ర్న్స్ ఇస్తామ‌ని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసిన‌ట్లు కేసు నమోదయింది. ఈ స్కీమ్‌లో మాస్టర్‌మైండ్ అయిన అమిత్ భ‌ర‌ద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ బిట్‌కాయిన్లతో ఉక్రెయిన్‌లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ.. శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రకు చెందిన 98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.

Exit mobile version