Site icon Swatantra Tv

తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌ నగర్‌, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్‌, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌ తదితర చోట్ల వర్షం పడింది. రహదారులన్ని జలమయ్యాయి. రోడ్ల మీద అక్కడక్కడా నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.

రాత్రి నుంచి వాన పడుతుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వానల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Exit mobile version