Site icon Swatantra Tv

వైసీపీ గ్రాఫ్ పెరిగిందంటున్న భీమవరం బెట్టింగ్ బ్యాచ్

      భీమవరం బెట్టింగ్‌ బ్యాచ్‌ తీర్పు విపక్ష కూటమి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతిపక్షాలను కలవరపెడుతోంది. జగన్‌ టార్గెట్‌గా అంతా ఒక్కటై పోరాడుతున్నా, వారికి కాలం కలిసొచ్చేలా లేదం టోంది ఈ బెట్టింగ్‌ బ్యాచ్‌. పొత్తులకు ముందు. పొత్తులకు తర్వాత సీన్‌ మారిపోయిందని చెబుతోంది. మరి విపక్ష కూటమి, వైసీపీ మధ్య హోరోహోరీగా సాగుతున్న ఏపీ ప్రజాక్షేత్ర పోరులో నెగ్గేదెవరు..? తగ్గేదె వరు.?. ఇంతకీ భీమవరం సర్వే చెబుతున్నదేంటి.?

      ఏపీలో ఎన్నికల పోరు హోరోహారీగా సాగుతోంది. జగన్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంటే, వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వైనాట్‌ 175 అంటూ దూసుకు పోతున్నారు సీఎం జగన్‌. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నంకావడంతో గెలుపోటములపై పందెం రాయుళ్ల బెట్టింగ్‌లు జోరందుకు న్నాయి. ఏపీని ఏలే మొనగాళ్లెవరనే అంచనాలతో సర్వేలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే భీమవరం బెట్టింగ్‌ బ్యాచ్‌ గతంలో చెప్పిన తీర్పును మార్చి చెబుతోంది. కూటమి ఏర్పాటుకు ముందుకు వైసీపీ పని అయిపోయిం దని. టీడీపీ, జనసేనకు అనుకూల పవనాలు వీస్తున్నాయని, విజయం వారి సొంతమేనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో వైసీపీకి 50 నుంచి 64 సీట్లకు మించి రావని వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ ఫిగర్‌ మారిపోయింది. ఈ కొద్దిరోజుల్లోనే వైసీపీ గ్రాఫ్‌ పెరిగిందని, 80 నుంచి 90 స్థానాల్లో ఫ్యాన్‌దే హవా అంటోంది. పొత్తులే ప్రతిపక్షాల కొంప ముంచాయని చెబుతోంది.

  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని మొదటి నుంచి పవన్‌కల్యాణ్‌ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించారు. తాను అనుకున్నట్టుగానే టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా జగన్‌పై ఎన్నికల కదనరంగంలో కాలుదువ్వుతున్నాయి. అయితే ఇవే పొత్తులు వారి కొంప ముంచుతున్నాయి. అసంతృప్తుల సెగులు రేపుతున్నాయి. ప్రత్యర్థికి చేయూతనిచ్చేందుకు జగన్‌ విజయానికి తోడుగా నిలిచేందుకు కారణమవుతు న్నాయి. అవును ఏ పొత్తుతోనైతే జగన్‌ను చిత్తు చేయాలనుకున్నారో. అదే పొత్తు వ్యూహం ప్రతిపక్షాలకు బెడిసికొడుతోంది. ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా త్యాగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల పార్టీ ముఖ్య నేతలకు సైతం మొండి చేయి చూపించాల్సి వచ్చింది. ఇన్నేళ్లు పార్టీనే నమ్ముకుని, ఆ జెండానే భుజాన మోసిన వారిని పక్కన పెట్టారు టీడీపీ, జనసేన అధినేతలు. దీంతో ఓ రేంజ్‌లో టికెట్‌ కోసం నిరసన జ్వాలలు ఎగిసి పడ్డాయి. రోడ్డెక్కి ఆందోళనలు చేసినా పట్టించుకోని పరిస్థితి. దీంతో హైకమాండ్‌ తీరుపై రగిలి పోయిన నాయకు లంతా ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పి జగన్‌తో జతకట్టారు. ప్రత్యర్థి ఓటమికి పని చేయా ల్సిన లీడర్లు ఇప్పుడు అదే ప్రత్యరథి పంచన చేరి మీ ఓటమి చూసే వరకూ నిద్రపోమన్నంత కసిలో ఉన్నారు. ఇందుకు ఉదాహరణ పోతిన మహేష్‌. ఆయనొక్కరే కాదు. అలా చాలా మంది నేతలు టికెట్‌ రాకపోవడంతో వైసీపీ శిబిరంలో చేరిపోయారు. దీంతో జగన్‌ బలం మునుపటి కంటే రెట్టింపయిందం టున్నాయి రాజకీయ వర్గాలు.

    ఇదిలా ఉంటే మేము సిద్ధం సభలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు జగన్‌. ప్రచార బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌ తానే అయ్యారు. ఆ ఒక్కడే టీడీపీ, జనసేన, బీజేపీలను ఎదుర్కొంటూ తనదైన స్టైల్‌లో దూసుకు పోతున్నారు. జగన్‌ బస్సు యాత్రతో క్యాడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంది. మరోపక్క సీఎంకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇసుకేస్తే రాలనంతా జనం తరలి వస్తున్నారు. ఇక ఓవైపు జగన్‌ బస్సుయాత్రల్లో పాల్గొంటూనే, మరోవైపు అసంతృప్తులకు గాలెం వేస్తూ వారిని తమవైపుకు లాక్కుంటున్నారు. ఈ క్రమంలో మేము సిద్ధం సభల్లో భారీగా చేరికలు కొనసాగుతు న్నాయి. జిల్లాల్లో పర్యటిస్తూనే తమ పార్టీలో చేరే ప్రతిపక్ష నేతలకు కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు జగన్‌. ఇలా ఓవైపు వైసీపీకి అనుకూల పవనాలు వీస్తుంటే, విపక్ష కూటమికి మాత్రం అసంతృ ప్తులు తలనొప్పిగా మారాయి. ఈ పరిణామాలే అధికార పార్టీకి కలిసొస్తుందని చెబుతోంది భీమవరం బెట్టింగ్‌ బ్యాచ్‌. అంతా ఒక్కటై ఉమ్మడిగా పోరాడుతున్నా జగన్‌ వారితో సమానంగా సీట్లు సాధించగలడని, 80 నుంచి 90 స్థానాల్లో ఫ్యాన్‌ గాలి వీస్తుందని చెబుతోంది. మొత్తానికి పొత్తులతో జగన్‌ను చిత్తుచేయ వచ్చన్న వ్యూహం ప్రతిపక్ష కూటమికి బెడిసి కొడుతోంది. వారి గ్రాఫ్‌ తగ్గుతుంటే, అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్‌ మాత్రం పెరుగు తోంది. గతంలో 64 సీట్లు దాటవన్న అంచనా వేస్తే, ఇప్పుడా సంఖ్య 90కి చేరింది. ఇక భీమవరం బెట్టింగ్‌ బ్యాచ్‌ చెప్పిందంటే ఆ లెక్కలు పక్కా అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఈ హోరాహోరీ పోరులో జగన్‌ గురిపెట్టినట్టు 175 సీట్లతో క్లీన్‌ స్వీప్‌ చేస్తారా.? మళ్లీ అధికార పగ్గాలు చేతపడతారా.? లేదంటే వైసీపీ ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా.? మొత్తానికి ఏం జరగనుంది అన్నది తేలాలంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ వేచి చూడా ల్సిందే.

Exit mobile version