Site icon Swatantra Tv

నేడు భారత రత్న అవార్డుల ప్రదానం

    భారత దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. సీనియర్ రాజకీయ వేత్త ఎల్ కే అద్వానితోపాటు దివంగత ప్రధానులు చౌదరీ చరణ్ సింగ్, పి.వి. నరసింహా రావు, బీహార్ మాజి ముఖ్యమంత్రి కర్ఫూరీ ఠాకుర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు మరణానం తరం ఈ అవార్డును ప్రకటించారు. వారి తరుపున వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డులను అందుకున్నారు. భారత రత్న అవార్డును నెలకొల్పిన తర్వాత ఒకే సారి ఐదుగురికి అవార్డు ప్రదానం ఇదే ప్రథమం.

   బహుముఖ విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు పి.వి. నరసింహారావు ప్రధానిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా , ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా విశిష్టసేవలు అందించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే నిర్ణయాలు తీసుకున్న నరసింహారావు తరుపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు భారత రత్న అవార్డును అందుకున్నారు. చౌదరీ చరణ్ సింగ్ దేశ ప్రధానిగా, కేంద్రమంత్రిగా, యుపీ ముఖ్యమంత్రిగా దేశానికి ఎన్నో సేవలందించారు. ఆయన తన జీవితాన్ని రైతులు, వ్యవసాయ దారుల సంక్షేమం హక్కులకోసం అంకితం చేశారు. అందుకే ఆయన పుట్టిన రోజును కిసాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Exit mobile version