Site icon Swatantra Tv

గిరిజన మహిళల తిరుగుబాటుతో భగ్గుమన్న సందేశ్ ఖలీ

       సందేశ్ ఖలీ పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాల్లోని మారుమూల గ్రామం. ఇటీవల ఒక్కసారిగా వార్త ల్లోకి ఎక్కింది. ఏళ్లుగా భూకబ్జాలకు, అత్యాచారాలకూ, లైంగిక వేధింపులకు బలైన మహిళలు తమకు జరిగిన అన్యా యాన్ని నిలదీస్తూ.. రోడ్డెక్కడంతో అక్కడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజ హాన్ షేక్, అతడి అనుచరులు సాగిస్తున్న అకృత్యాలు ప్రపంచానికి తెలిశాయి.ఎట్టకేలకు షేక్ అరెస్ట్ అయ్యాడు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు ఈ సమస్యపై స్పందించాయి.

      పశ్చిమ బెంగాల్ లో సుందర్బన్ అటవీ ప్రాంతంలో గంగా నదీ గ్రామం సందేశ్ ఖలీ. ఆ ప్రాంతంలో టీఎంసీ నాయ కుడు షాజహాన్ షేక్, ఆయన అనుచరులు సిబాప్రసాద్ అలియాస్ శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్, ఇతరులు కొన్ని ఏళ్లుగా గూండా రాజ్యం సాగిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. కింది స్థాయినుంచి ఎదిగిన షాజహాన్ 2003లో రాజకీయాల్లో అరంగేట్రం చేసి , ఉత్తర 24 పరగణాలజిల్లాలో కీలక నేతగా ఎదిగాడు. చాలా వ్యాపారాలు చేస్తూ, అధిక వడ్డీకి రైతు లకు అప్పులు ఇవ్వడం, స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తూ వారిని తన గుప్పిట్లో పెట్టుకోవడం, అప్పులు తీర్చలేని రైతుల భూములు గుంజుకుని వాటిని చేపల చెరువులుగా రొయ్యల చెరువులుగా చేస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు షాజహాన్ షేక్. భూములు ఇవ్వని పక్షంలో మహిళలపై అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు పాల్పడే వారు..షేక్, అతడి అనుచరులు. అతడి రాజకీయ పలుకుబడి వల్ల ఈ దారుణాలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

      పశ్చిమ బెంగాల్ లో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో వందలకోట్ల రేషన్ పంపిణీ స్కామ్ ఒకటి. పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతి ప్రియ మాలిక్ తో పాటు షాజహాన్ కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉంది. స్కామ్ కారణంగా జ్యోతి ప్రియ మాలిక్ ను పదవి నుంచి తొలగించారు. అతడిని అరెస్ట్ చేశారు. స్కామ్ పై విచారణ చేపట్టిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బృందం షాజహాన్ ఇంటికి తనిఖీలకు వెళ్తే , షేక్ అతడి గూండాలతో ఈడీ అధికారులపైనే దాడి చేయించా డు. దాదాపు వెయ్యిమంది ఈ దాడిలో పాల్గొన్నారు. జనవరి 5న దాడి జరిగిన నాటి నుంచీ షాజహాన్ పరారయ్యాడు.

       ఈడీ దాడుల అనంతరం షాజహాన్, అనుచరుల దారుణాలకు నిరసనగా మహిళలు ఆందోళన చేపట్టారు. షేక్ ను అతడి గూండాలను అరెస్ట్ చేయాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లైంగిక దాడులతో ఇబ్బందులు పడ్డ మహి ళలు మీడియా ముందుకు వచ్చారు. షాజహాన్, గూండాలు చేసిన అత్యాచారాలు,వేధింపులను చెప్పి కంటతడిపెట్టా రు. స్కూల్ పిల్లలకు మద్యం అలవాటు చేసి వారి చేతికి గన్ లు ఇచ్చి, దోపిడీలు, హింసాకాండ చేయించేవారని, గూండాల వత్తాసుతో వాళ్లు మహిళ లను వేధించేవారని స్థానిక మహిళలు ఆక్రోశించారు.

       తిరగబడ్డ మహిళలు షేక్ ఆస్తుల్ని తగులపెట్టారు. అడ్డుకున్న పోలీసులను మహిళలే తరిమి కొట్టారు. దీంతో అధికార టీఎంసీ పార్టీ అండదండలతో షాజహాన్ అండ్ కో చేసిన అత్యాచారాలు ప్రపం చానికి తెలిశాయి. ప్రజాగ్రహం చూసిన బీజేపీ, కాంగ్రెస్ , సీపీఎం సహా పలు రాజకీయ పార్టీలు ఆందోళ నలు చేపట్టాయి. ఇంత జరుగుతున్నా.. బెంగాల్ లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫిబ్రవరి 10న పార్టీ నుంచి ఆరేళ్లు సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. దీంతో కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుంది. షాజహాన్ షేక్, అతడి అనుచరులను అరెస్ట్ చేయవల్సిం దిగా బెంగాల్ పోలీసులను ఈ నెల 26న ఆదేశించింది. సీబీఐ, ఈడీ కూడా అరెస్ట్ చేయవచ్చని స్పష్టం చేసింది. జనవరి 5న పరారైన షాజహాన్ షేక్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి పది రోజుల పాటు రిమాండ్ విధించింది. పరారైన షేక్ టీఎంసీ రక్షణలోనే ఇన్నాళ్లు బతికా డన్నది బహిరంగ రహస్యం. ఇకనైనా టీఎంసీ ప్రభుత్వం స్పందించి అన్యాయానికి గురైన సందేశ్ ఖలీలోని రైతులు, మహిళలకు న్యాయం చేయాలి.

Exit mobile version