Site icon Swatantra Tv

అవ్వ..! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?- RGV

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టై, జైలుకు వెళ్లడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దీన్ని ఖండించి బాబుకు మద్దతు ప్రకటించారు. మరికొందరు మాత్రం జగన్ ప్రభుత్వం చర్యలను సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాబును పరోక్షంగా విమర్శించేలా ఎక్స్ (ట్విట్టర్‌‌)లో వరుస పోస్టులు పెడుతున్నారు. తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిన్న తెలుగు దేశం పార్టీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే, బంద్ ను ప్రజలు పట్టించుకోలేదని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు. ‘మై నాట్ డియర్ ఏపీ ప్రజలారా, నలభై సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని లోపలేసినందుకు బంద్ కి పిలిస్తే, ఏ మాత్రం కేర్ చెయ్యకుండా మీ పనులు చేసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, షాపింగ్ లు చేసుకున్నారా? అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా?’ అని అని ట్వీట్ చేశారు.

Exit mobile version