Site icon Swatantra Tv

ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా-పవన్‌ కళ్యాణ్‌

కాకినాడలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. కుటుంబానికి 55 లక్షల రపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఆనందంగా కలవాల్సిన పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయి ఇలా కలవడం బాధగా ఉందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రారంభంలోనే.. కుటుంబ సభ్యులకు అండగా ఉండడం కోసమే ఇన్సూరెన్స్ సభ్యత్వాలు ప్రారంభించామని చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వెయ్యలేదన్నారు. భవిష్యత్ లో ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని పవన్‌ భరోసా ఇచ్చారు.

Exit mobile version