Site icon Swatantra Tv

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలోనూ బీసీలకు ఎనిమిది మంత్రి పదవులు ఇవ్వాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేవని టికెట్లు నిరాకరించిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలుగా గెలిచిన బీసీ ఎమ్మెల్యేల కన్నా మంత్రి పదవులు కేటాయించాలని కోరారు. వారంలో రాహుల్ గాంధీని కలిసి తామెంతో తమకంతా అనే నినాదాన్ని గట్టిగా వినిపిస్తామన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం పోరాడిన బీసీ నేతలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. అవకాశవాదులను పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పతనమవుతోందని హెచ్చరించారు.

 

Exit mobile version